ఛాంపియన్ రివ్యూ | Tollywood Talk Show

ఛాంపియన్ మన శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ యాక్ట్ చేసిన మూవీ ... మూవీ గ్లింప్సెస్, టీజర్ చూసి ఏదో ఫుట్బాల్ మ్యాచ్ మూవీ అనుకున్న కానీ మన వరంగల్ లో రజాకార్ల చేసిన ఒక్క దారుణాన్ని చూపించే ప్రయత్నం అని ట్రైలర్ చూసాక తెలిసింది.... 

స్టోరీ విషయానికి వెళ్తే ఇంగ్లండ్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాలి అని కలలు కనే మైకేల్ కి అతని తండ్రి చేసిన పనులు ఆడంకి గా మారుతాయి...ఇంకా అనుకునేది సాధించాలి అంటే బీదర్ కి గన్స్ సప్లై చేయాల్సి వస్తుంది.. అలా గన్స్ ను తీసుకెళ్తున మైకేల్ బైరాన్ పల్లి లో ఇరుకుంటాడు.. ఆ తరువాత ఏం జరిగింది. మైకేల్ బైరాన్ పల్లి ప్రజలకి ఎలా సహాయ పడ్డాడు అనేది మూవీ....

మూవీలో రోషన్ యాక్టింగ్ ఇరగదీశాడు అని చెప్పొచ్చు.. యాక్షన్ ఎమోషన్ సీన్స్ లో కూడా మెచ్యూరిటీ చూపించాడు.. కాకపోతే కొన్ని చోట్ల ఇంకా కష్టపడాలి అనిపించింది.

హీరోయిన్ అనస్వర రాజన్ కూడా మూవీ స్టోరీ లో ఒదిగిపోయింది.. మూవీకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ప్రశంసించాల్సిన విషయం .
ఇంకా చాలా కాలం తరువాత వెండితెర మీద కనిపించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు చేసిన పాత్రలో ఒక పేదరికము కనిపించింది ..ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.. కానీ తెలంగాణ యాస మాత్రం ఆయనకి అంత సెట్ అవ్వలేదు అనిపించింది..

ఇంకా మూవీలో రచ్చ రవి గారి రోల్ ఇంప్రెస్స్ చేస్తుంది.. ఇప్పటివరకు చేసిన చిల్లర కామెడీ రోల్స్ కాకుండా ఫస్ట్ టైమ్ యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ లో నటించే అవకాశం దొరికింది రచ్చ రవి గారికి ..

ఇంకా మిగిలిన యాక్టర్స్ బలగం సంజయ్, KK మీనన్ , అర్చన, మురళి శర్మ గార్లు వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు..

టెకినికల్ టీం విషయానికి వస్తె మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ గారు చాలా రోజులతరువాత మళ్ళీ మిక్కి గారి మ్యాజిక్ రిపీట్ అయ్యింది అని చెప్పొచ్చు. సాంగ్స్ , BGM తో సినిమాకి ప్రాణం పోశారు మిక్కీ జె మేయర్ గారు .. ఇంకా సినిమాటోగ్రఫీ , ఆర్ట్ వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి..
కాకపోతే గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది. దాని వల్ల సినిమాటోగ్రఫీ అనుకున్న ఔట్పుట్ రాలేదు అని చెప్పొచ్చు... కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ కూడా సరిగా వర్క్ అవ్వలేదు అనిపించింది..
ఇంకా ఫైనల్గా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం..రియల్ ఇన్సిడెంట్ ను మెయిన్ పాయింట్ గా తీసుకొని దానికి స్టోరీ అల్లడం చాలా సార్లు చూసాం. కాకపోతే ఇలాంటి స్టోరీస్ నీ నిజ నిజాలు ధైర్యంగా ప్రజెంట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అలా కాకుండా మివిని కేవలం స్టోరీ ల చూపించారు.. ఒక్క వైపు హీరో రోల్ నీ డెవలప్ చేస్తూ ఆ బైరాన్ పల్లి బ్యాక్ స్టోరీ నీ చూపించే అవకాశం ఉన్న ఆ స్టోరీ నీ సినిమాటిక్ వెర్షన్ లో మాత్రమే చూపించడం బాధాకరం అనిపించింది..ఆ విషయం లో డైరెక్టర్ కి సో సో మార్కులే పడుతాయి..

ఏది ఏమైనా బైరాన్ పల్లి స్టోరీ అందరికీ తెలిసేలా చేయడం బాగుంది...

ఓవర్ ఆల్ గా 120 మంది ప్రజలు మాత్రమే ఉండే బైరాన్ పల్లి మీద 1900 మంది రజాకర్ల గన్స్ , ఫిరంగిల్లతో దాడి చేస్తే నెల రోజులు వాళ్ళని ఊర్లోకి రాకుండా పోరాడారు బైరాన్ పల్లి ప్రజలు ఆ వీరుల స్టోరీ నీ ఈ మూవ్ ద్వారా తెలుసుకోవడం నా వరకు గొప్ప విషయం ...

ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని కోరుకునే సగటు ఆడియన్ గా ఛాంపియన్ బెస్ట్ అటెంప్ట్ అని నా ఒపినియన్..

Comments

Popular posts from this blog

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |

శాంబాల రివ్యూ | Tollywood Talk Show