ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |
ఉస్తాద్ భగత్ సింగ్.OG తరువాత పవర్ స్టార్ట్ నుంచి వచ్చిన మూవీ. డైరెక్టిట్ హరీష్ శంకర్ గారు ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కల్యాణ్ గారికి గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చి పవర్ స్టార్ కంబ్యాక్ కి పునాది వేశారు. అలాంటి వాళ్ళ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఈ రోజు థియేటర్స్ లోకి వచేసింది..
స్టోరీ విషయానికి వెళ్తే చిన్నయ్య అలియాస్ ఉస్తాద్ భగత్ సింగ్ కి గార్డియన్ ఉన్న CM మీద టెర్రరిస్ట్ ఎటాక్ జరుగుతుంది...కాకపోతే పెదాయనికి మాట ఇచ్చి అండర్గ్రౌండ్ కి వెళ్ళిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆ ఎటాక్ వెనక ఉన్న అసలు ద్రోహులను ఎలా కనిపెట్టి ఎండ్ చేశాడు అనేది మూవీ బాస్...
యాక్టర్స్ విషయానికి వస్తె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఖుషీ మూవీ తరువాత ఆయన ఇంత గ్లామర్ గా కనిపించిన మూవీ ఇదే .. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది... ఇంకా అయ్యి మాస్ యాక్షన్ మరోసారి 2000 లోకి తీసుకెళ్ళింది...
రాశి ఖన్నా గారి విషయానికి 1st హాఫ్ హీరోయిన్ ఎంటర్టైన్మెంట్ రోల్ చేశారు.. కొన్ని సీన్స్ లో గ్లామర్ గా కనిపించారు ..
అలాగే శ్రీలీల గారు సెకండ్ హాఫ్ లో మెస్మరైజ్ చేస్తారు... లిమిటెడ్ సీన్స్ అయ్యిన క్యూట్ గా కనిపించి అక్కట్టుకున్నారు...
ఇంక విలన్ పార్థిబన్ గారి విలనిజం లో గాంభీర్యం స్క్రీన్ మీద బాగున్న ఆయనలోని పూర్తి నటుడ్ని ప్రజెంట్ చేయలేకపోయాడు మన డైరెక్టర్ అనిపించింది...
పెద్దాయన పాత్రలో కనిపించిన మరో డైరెక్టర్ కం యాక్టర్ KS రవికుమార్ గారు ఆయన పాత్రకి న్యాయం చేశారు అని చెప్పొచ్చు.. అలాగే గౌతమి గారు కూడా Lb శ్రీరామ్ గారు లాంటి యాక్టర్స్ మూవీలో చిన్న పాత్రలు చేశారు..
టెకిల్నికల్ టీం విషయానికి వస్తె మ్యూజిక్ DSP గారు.. సాంగ్స్ అప్పుడు అప్పుడు వస్తున్నాయి కానీ సరిగా కిక్ ఇవ్వలేదు అనిపించింది.. కాకపోతే తమన్ BGM మాత్రం మూవీని పైకి లెప్పింది... అసలు మూవీలో సెకండ్ హీరో తమన్ గారు అనిపించింది ఆయన ఇచ్చిన ఎలివేషన్ మ్యూజిక్ థియేటర్లో శవాలు లేస్తాయి అనిపిస్తుంది...
ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ట్ వర్క్ అదిరిపోయాయి కానీ యాక్షన్ రామ్ లక్ష్మణ్ గారు ఇంకా 90s 20s ఫార్మాట్ లో ఫైట్స్ కంపోజ్ చేయడం నచ్చలేదు బాస్...
ఫైనల్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు...తేరి మూవీ రీమేక్ అని అప్పట్లో అన్నారు కానీ కేవల ఒక్క చిన్న లైన్ మాత్రమే తేరి నుంచి తీసుకొని స్టోరీ మొత్తం మార్చేసి పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్టోరీ రెడీ చేశారు హరీష్ శంకర్ గారు.. ఆయన రాసిన డైలాగ్స్ పేలలేదు కానీ ఒక్క డైలాగ్ మాత్రం అదిరిపోయింది.. కడుకోనే నీళ్ళు అప్పు ఆడుకునే పక్కదేశం కుక్కలు అనే డైలాగ్ ఆయనలోని డెప్త్ నీ మూవీలోని స్టోరీ నీ ఎలివేట్ చేసింది...
ఓవర్ ఆల్ గా సాంగ్స్ పర్వాలేదు అనిపించింది.. యాక్షన్ ఎపిసోడ్స్ కి తమన్ గారి BGM ప్రాణం పోసింది.. సినిమాకి పవర్స్టార్ గ్లామర్ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అయ్యింది .. బొమ్మ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నా ఒపీనియన్ బాస్ ....
మీరు మూవీ చూస్తే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి అలగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్
Comments
Post a Comment