ఛాంపియన్ రివ్యూ | Tollywood Talk Show
ఛాంపియన్ మన శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ యాక్ట్ చేసిన మూవీ ... మూవీ గ్లింప్సెస్, టీజర్ చూసి ఏదో ఫుట్బాల్ మ్యాచ్ మూవీ అనుకున్న కానీ మన వరంగల్ లో రజాకార్ల చేసిన ఒక్క దారుణాన్ని చూపించే ప్రయత్నం అని ట్రైలర్ చూసాక తెలిసింది.... స్టోరీ విషయానికి వెళ్తే ఇంగ్లండ్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాలి అని కలలు కనే మైకేల్ కి అతని తండ్రి చేసిన పనులు ఆడంకి గా మారుతాయి...ఇంకా అనుకునేది సాధించాలి అంటే బీదర్ కి గన్స్ సప్లై చేయాల్సి వస్తుంది.. అలా గన్స్ ను తీసుకెళ్తున మైకేల్ బైరాన్ పల్లి లో ఇరుకుంటాడు.. ఆ తరువాత ఏం జరిగింది. మైకేల్ బైరాన్ పల్లి ప్రజలకి ఎలా సహాయ పడ్డాడు అనేది మూవీ.... మూవీలో రోషన్ యాక్టింగ్ ఇరగదీశాడు అని చెప్పొచ్చు.. యాక్షన్ ఎమోషన్ సీన్స్ లో కూడా మెచ్యూరిటీ చూపించాడు.. కాకపోతే కొన్ని చోట్ల ఇంకా కష్టపడాలి అనిపించింది. హీరోయిన్ అనస్వర రాజన్ కూడా మూవీ స్టోరీ లో ఒదిగిపోయింది.. మూవీకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ప్రశంసించాల్సిన విషయం . ఇంకా చాలా కాలం తరువాత వెండితెర మీద కనిపించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు చేసిన పాత్రలో ఒక పేదరికము కనిపించింది ..ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ...