శాంబాల రివ్యూ | Tollywood Talk Show
ఫైనల్ గా థియేటర్స్ లోకి "శాంబాల" అనే మూవీ వచేసింది.. ప్రేమ కావాలి లో డాన్స్, ఫైట్స్ , యాక్షన్ తో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి ప్రశంసలు అందుకున్న అది సాయి కుమార్ గారు అప్పట్లో పెద్ద హీరో అవుతారు అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆయన స్టోరీ సెలెక్షన్స్ యాక్టింగ్ లో వేరియేషన్స్ చూపించకపోవడం ఇలా ఎన్నో లోపాలతో అది సాయికుమార్ మూవీస్ చేస్తాడు కానీ ఎవరు చూడరు అని మైనస్ మార్క్ ఆయన మీద పడింది... అది సాయి కుమార్ గారి మూవీస్ అంటే కనీసం OTT లో కూడా రిలీజ్ అవ్వడం కష్టం అనే స్టేజ్ కి వెళ్లిపోయారు అది గారు.. ఇలాంటి సమయం లో కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చిన మూవీ శాంబాలా....
స్టోరీ విషయానికి వెళ్తే శాంబాల అనే ఊర్లో ఒక్క ఉల్క వచ్చి పడుతుంది.. అది పడ్డాక వింత సమస్యలు ఆ ఉరి ప్రజలను వేధిస్తుంటాయి... ఆ సమస్యలు ఏంటి వాటిని సైంటిస్టు విక్రమ్ ఎలా పరిష్కరించాడు ఈ క్రమంలో విక్రమ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది మూవీ ....
యాక్టర్స్ విషయానికి వస్తె అది సాయికుమార్ గారు.. ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలి అని మూవీలో రోల్ పరంగా లోపాలు ఉన్న ఆయన స్టాండర్డ్స్ మించి యాక్టింగ్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు అనిపించింది...
హీరోయిన్ అర్చన అయ్యర్ సినిమాలో అవిడ రోల్ చుట్టు స్టోరీ ఉంటుంది కానీ అవిడ చేయడానికి ఏం లేదు అనిపించింది.. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అనిపించింది...
ఇంకా శ్వాసిక విజయ్ గారు అవిడ రోల్ కి ఎంషన్స్ బాగా వర్క్ ఔట్ అయ్యింది.. ఐతే అవిడ గ్లామర్ మీద పెట్టిన ఫోకస్ డైరెక్టర్ స్టోరీ మీద పెట్టీ ఉంటే బాగుండేది అనిపించింది...
ఇంకా మిగిలిన యాక్టర్స్ రవివర్మ గారి రోల్ స్పెషల్ అట్రాక్షన్ మూవీకి .. ఇంకా ఇంద్రనీల్, అన్నపూర్ణమ్మ,మీసాల లక్ష్మణ్ లాంటి వారి యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి అని చెప్పొచ్చు..
టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల గారు సినిమాకి బ్యాక్బోన్ అని చెప్పాలి.. సినిమాలో సీన్స్ vifx సరిగా లేకపోయినా సీన్స్ ఆసక్తి కారంగా ఉన్నాయి అంటే ఆది శ్రీ చరణ్ పాకాల గారి మ్యూజిక్ మ్యాజిక్ అని చెప్పాలి. ఇంకా ఆర్ట్ వర్క్ , ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. కానీ vfx గ్రాఫిక్స్ మాత్రం సరిగా వర్క్ అవ్వలేదు అని చెప్పాలి....
ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ యుగంధర్ AD infunituma అనే మూవీతో ఆయన టేలెంట్ ఏంటి అనేది నిరూపించుకున్నారు. ఈ మూవీలో కూడా అదే షాట్ కాంపోజిషన్ తో ఆయన మార్క్ చూపించారు.. కానీ కథ మీద గ్రాఫిక్స్ మీద ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే మూవీ బ్లాక్బస్టర్ అయ్యేది.. క్లైమాక్స్ , బ్యాక్ స్టోరీ వంటి విషయాల్లో క్లారిఫికేషన్ సరిగా ఇవ్వలేదు కానీ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కొంత వరకు సీటు లో కూర్చో పెట్టగలిగాడు అని చెప్పొచ్చు...
మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తె అది సాయి కుమార్ గారి యాక్టింగ్ , శ్వాసిక గారి ఎంషనల్ సీన్స్ , శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్, స్టోరీ
మైనస్ విషయానికి వస్తె జస్టిఫికేషన్ లేని సీన్స్, గ్రాఫిక్స్ , అనవసరమైన కొన్ని సీన్స్..
ఓవర్ ఆల్ గా శాంబలా ఆది సాయి కుమార్ గారి బెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.. మూవీ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది.. ఈ క్రిస్మస్ హాలిడేస్ లో బెస్ట్ మిస్టరీ ఎంటర్టైన్మెంట్ అని నా ఒపినియన్ బాస్..
మీరు మూవీ చూస్తే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి అలగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్
Comments
Post a Comment