"‘మ్యాన్ ఆఫ్ ది హౌస్’ చిట్టిబాబు వచ్చేశాడు! ఆకట్టుకుంటున్న 'ఆదర్శ కుటుంబం' గ్లింప్స్!"
విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబో 'ఆదర్శ కుటుంబం': ఆకట్టుకుంటున్న 'మ్యాన్ ఆఫ్ ది హౌస్' (చిట్టిబాబు) గ్లింప్స్ ! తెలుగు చిత్రసీమలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు చిరునామా విక్టరీ వెంకటేష్. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47 (AK47)'. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ చిత్రం నుంచి 'చిట్టిబాబు' (The Man of the House) క్యారెక్టర్ పరిచయ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. చిట్టిబాబుగా వెంకటేష్ మార్క్ వినోదం! ఈ గ్లింప్స్ చూస్తే వెంకటేష్ మళ్లీ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించడానికి సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది. కథలో వెంకీ పాత్ర పేరు 'చిట్టిబాబు'. ఇంట్లో వంట చేయడం, బట్టలు ఉతకడం, మిగతా ఇంటి పనులన్నీ దగ్గరుండి చూసుకోవడమే చిట్టిబాబు ప్రత్యేకత. గ్లింప్స్ ప్రారంభంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (స్వర్ణ) కిచెన్‌లో ఏసీ చూసి "నాన్న.. నువ్వు వంట చేసేట...